హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూములు, చెరులు, పార్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పుడు అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు దింపుతోంది. ఈ హైడ్రాకు కమిషనర్‌గా ఏపీ రంగనాథ్ ఉండగా.. ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ పని తీరు వల్లే.. ఇప్పుడు ఇంత చర్చనీయాంశంగా మారిందన్న చర్చ నడుస్తోంది. అయితే.. రంగనాథ్‌పై పలువురు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మాత్రం ప్రశంసలు కురిపించారు.