తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది. కొత్త ROR చట్టాన్ని తీసుకురానుండగా మంత్రి పొంగులేటి సభలో బిల్లును ప్రవేశపెట్టారు. భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో పేదల భూములు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఆ భూములను వెనక్కి తీసుకుంటామన్నారు.