తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. గ్రామీణ పరిపాలనను మరింత సులభతరం చేసేందుకు రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 పోస్టులను మంజూరు చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల విడుదల చేయనున్నారు. అయితే దీనికి ఎవరు అర్హులు అనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.