తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ అకునూరి మురళి ప్రశంసించారు. గవర్నర్ అనుమతి లేకుండానే 10 కీలక బిల్లులను చట్టాలుగా మార్చడం ద్వారా స్టాలిన్ ఫైటింగ్ స్పిరిట్‌ను ఆయన కొనియాడారు. ఇది బీజేపీ అప్రజాస్వామ్య పాలనకు వ్యతిరేకంగా నిలుస్తుందని, ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తినిస్తుందని అకునూరి మురళి సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడ్డారు.