Nara Lokesh Respond On Srikalahasti Temple Prasadam: శ్రీకాళహస్తి దేవాలయంలో క్యూలైన్లలో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపించారంటూ ఓ భక్తుడు ట్వీట్ చేశారు. వెంటనే మంత్రి లోకేష్ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించారు. వెంటనే ఈ అంశంపై తక్షణ విచారణకు ఆదేశించారు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఏ చర్యను కూడా ఉపేక్షించేది లేదన్నారు. కొంతమంది సిబ్బంది ఇప్పటికీ గత ప్రభుత్వంలోని విధానాల నుంచి బయటకు రాలేదని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు మంత్రి.