కల్వకుంట్ల కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా పార్టీకి సంబంధించి ఆమె ప్రకటన చేయనున్నారని సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ పేరును ఇప్పటికే తెలంగాణ ప్రజా జాగృతి అని ప్రకటించగా.. ఆ రోజునే జెండా, అజెండా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ నమోదు కోసం.. ఈసీకి దరఖాస్తు చేసుకున్న కవిత.. త్వరలోనే దాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు.