తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇక కొండపై ఆ సమస్యలు తీరనున్నాయి. శనివారం సప్తగిరి సత్రాలు, సీఆర్వో కార్యాలయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు. గదుల కేటాయింపు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం లాకర్ల లభ్యతపై భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డులు, ఇన్ఫర్మేషన్ కియోస్క్‌లు ఉపయోగించాలని ఆదేశించారు. అలాగే గదులను కూడా పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.