సంగమేశ్వరాలయ శిఖరం బయటపడటంతో.. ఆలయ పూజారులు జెండా కట్టి పూజలు చేశారు. ఆగస్టు 6వ తేదీ సంగమేశ్వరాలయం జలాధివాసమైన సంగతి తెలిసిందే. అయితే, నెల రోజుల తర్వాత ఆలయ శిఖరం దర్శనమిచ్చింది. ఇరవై మూడేళ్ల కాలంలో ఈసారి తక్కువగా ఐదు వారాల వ్యవధిలోనే శిఖరం కనిపించడం గమనార్హం. శ్రీశైలం జలాశయ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 864 అడుగులకు చేరింది. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను నల్లమల సాగర్ జలాశయానికి తరలించడంతో సంగమేశ్వర ఆలయం జలాధివాసం నుంచి బయటకు వచ్చింది.