Srisailam Temple Income: శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. శుక్రవారం ఆలయంలోని హుండీలను లెక్కించారు. గత 29 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ.3,31,70,665 ఆదాయం వచ్చింది. వివిధ దేశాల కరెన్సీని భక్తులు స్వామి అమ్మవార్లకు మొక్కులుగా హుండీలో భక్తులు సమర్పించారు. నగదు, బంగారం, వెండిని కూడా భక్తులు కానుకల రూపంలో సమర్పించారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.