Srisailam Temple Darshan: శ్రీశైలంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి.. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారు ఈ నెల 7 నుంచి ఆలయంలో ప్రారంభమయ్య పూజల్లో ఉచితంగా పాల్గొనవచ్చు. అర్హులైన భక్తులు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉన్న రత్నగర్భ వినాయకుడు నిత్యం పూజలు అందుకుంటారు.