Srisailam Devotee Donates Tractor: శ్రీశైల దేవస్థానానికి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు శ్రీశైలం శాఖ ట్రాక్టర్‌ను విరాళంగా సమర్పించింది. బ్యాంకు చైర్మన్ ఎస్. సత్యప్రకాశ్ సింగ్ శుక్రవారం ఆలయ ఈవో పెద్దిరాజుకు ట్రాక్టర్‌ను అందజేశారు. ఈ ట్రాక్టర్ విలువ రూ.12 లక్షల దాకా ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు. ముందుగా గంగాధర మండపం వద్ద ట్రాక్టర్‌కు వాహన పూజలు చేపట్టారు. అనంతరం బ్యాంకు అధికారులకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు, స్వామిఅమ్మవార్ల చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు.