శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్ రూపొందించి భక్తులను మోసం చేస్తున్న వైనం వెలుగుచూసింది. హైదరాబాద్, ముంబయికి చెందిన కొంతమంది భక్తులు శ్రీశైలంలో వసతి కోసం ఈ నకిలీ వెబ్‌సైట్‌ను ఆశ్రయించి మోసపోయారు. డబ్బులు చెల్లించి మోసపోయారు. జరిగిన మోసం గురించి శ్రీశైలం దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. దీనిపై శ్రీశైలం దేవస్థానం అధికారులు దృష్టిసారించినట్లు తెలిసింది.