శీశైలం భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు శ్రీశైలం దేవస్థానం కీలక సూచనలు చేసింది. శ్రీశైలానికి వచ్చే భక్తులు వసతి కోసం దేవస్థానం వెబ్‌సైట్ సందర్శిస్తూ ఉంటారు. అయితే శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్ వెలుగుచూడటంతో దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు.ఈ క్రమంలో శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు భక్తులకు పలు సూచనలు చేశారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులు వసతి, దర్శనం, ఆర్జిత సేవల టికెట్ల కోసం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ మాత్రమే సంప్రదించాలని కోరారు. నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులకు శ్రీశైలం దేవస్థానం సూచించింది.