రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూల్ భవనం పైనుంచి దూకి టెన్త్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ప్రిన్సిపల్ తిట్టాడని మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో విద్యార్థి కుంటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.