షాద్‌నగర్ దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనలో పోలీసులపై కేసు నమోదైంది. సస్పెన్షన్‌లో ఉన్న షాద్‌నగర్ డీఐ రామిరెడ్డి సహా.. నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా హింస, మారణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు.