Pushpa 2: అభిమాని మృతి కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లిన అల్లు అర్జున్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టులో ఆసక్తికర వాదనలు చోటు చేసుకున్నాయి. క్వాష్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి.. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కేసు తెరపైకి తీసుకువచ్చారు. ఆ ఘటనలో షారుక్ ఖాన్ తప్పేమీ లేదని సుప్రీంకోర్టు.. ఆ కేసును కొట్టివేసిన విషయాన్ని అల్లు అర్జున్ లాయర్ గుర్తు చేశారు. దీంతో షారుక్ ఖాన్ తొక్కిసలాట ఘటనలో ఏం జరిగింది. కోర్టు ఏం తీర్పు చెప్పింది అనేది ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి.