సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. పటాన్‌చెరు వైపు వెళ్తున్న సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి.. టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 22 మంది గాయపడ్డారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.