హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడిన వ్యక్తిని హైకోర్టు పదేళ్ల తర్వాత నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఈ తీర్పు చర్చనీయాంశంగా మారింది. మొదట దోషిగా తేలిన వ్యక్తి తర్వాత నిర్దోషిగా బయటకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో 2014 ఫిబ్రవరి 20న జరిగిన కార్తీక్ అనే వ్యక్తి హత్య కేసులో ఇతడికి శిక్ష విధించారు. 2018 జనవరి 5న ఆదిలాబాద్ కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన వ్యక్తికి ప్రస్తుతం ఈ తీర్పు వెల్లడించింది. అసలేం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.