డిసెంబర్ 04వ తేదీ రాత్రి పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవటం ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లటం ఇప్పుడు తీవ్ర చర్చనీయంశంగా మారింది. ఈ క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి పలు వ్యాఖ్యలు చేయటం.. దానికి బన్నీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయటం మరోసారి చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే.. సంధ్య థియేటర్‌లో ఆ రోజు ఏం జరిగిందనేది ఓ నెటిజన్ వీడియో పోస్ట్ చేశాడు.