పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంథ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో బాలుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత మూడునెలలుగా వైద్యం అందిస్తున్నా.. బాలుడి ఆరోగ్యం విషయంలో ఎలాంటి పురోగతి లేదని డాక్టర్లు వెల్లడించారు. కళ్లు మాత్రమే తెరుస్తున్నాడని.. ఎవరినీ గుర్తుపట్టట్లేదని తాజా హెల్త్ అప్డేట్‌లో తెలిపారు.