సంధ్య థియేటర్ లైసెన్స్ విషయమై పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. లైసెన్స్ రద్దు విషయమై చిక్కడపల్లి పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. తొక్కిసలాటలో ఒకరి మృతికి కారణమైన థియేటర్ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలన్నారు. ఈ మేరకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ వారం రోజులు గడవు ఇచ్చారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.