ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఓ మందుబాబు చేసిన తల తిక్క పని.. అందరినీ టెన్షన్ పెట్టేసింది. మద్యం మత్తులో మనోడు ప్రాణాలను సైతం రిస్కులో పెట్టేసుకున్నాడు. మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు కిందకు దూరిన మందుబాబు అక్కడ ఉన్న స్పేర్ టైరుకు వేలాడుతూ 15 కిలోమీటర్లు ప్రయాణించాడు. బస్సు కింద మందుబాబు ఉన్న సంగతి తెలియని డ్రైవర్.. బస్సును నడుపుతూ పోయాడు. ఆయితే రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు గుర్తించి సమాచారం ఇవ్వటంతో.. మందుబాబు చేసిన తలతిక్క పని బయటకు వచ్చింది.