Sarpanch Elections Schedule: తెలంగాణలో త్వరలోనే మరో ఎన్నికల సంబురం షురూ కానుంది. గ్రామాల్లోని ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్పంచ్ ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే.. పంచాయతీ ఎన్నికల కోసం ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం(ఆగస్టు 21న) రోజున షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు అధికారులతో పంచాయతీ ఎన్నికల నిర్వాహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. పార్థసారథి సమీక్ష నిర్వహించారు.