సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌.. సొంతింటిపై హక్కుల పరిష్కారానికి 45 రోజుల గడువు

5 hours ago 1
సింగరేణి సంస్థ భూముల్లో దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న కార్మికుల భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను 45 రోజుల్లో పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. జీవో 76, జీవో 28కు అనుగుణంగా దరఖాస్తులను పరిశీలించనున్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్‌ ఛైర్మన్‌గా ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. కోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు అక్రమాలు ఉంటే చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఎనిమిది జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Read Entire Article