సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అన్ని వైపులా కలుపుతూ స్కైవాక్ నిర్మించడానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ సిద్ధమైంది. ఈ స్కైవాక్ ద్వారా ప్రయాణికులు రైల్వే స్టేషన్ నుండి బస్ స్టేషన్ , మెట్రో స్టేషన్ లకు నేరుగా వెళ్ళడానికి వీలుంటుంది. ప్రయాణికుల రద్దీని తగ్గించడం, ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరచడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. రాబోయే 30 సంవత్సరాలలో నగర రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్కైవాక్ ను 800 మీటర్ల పొడవున నిర్మించనున్నారు.