సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోరీలకు పాల్పడుతున్న తంబళ్ల నితిన్, ఇందిరాల రాకేష్‌లను ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి 144.6 గ్రాముల బంగారం లభ్యమైంది. జూదం, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడిన ఈ నిందితులు గతంలో జైల్లో పరిచయం చేసుకున్నారు. సికింద్రాబాద్ జీఆర్పీ పరిధిలో నాలుగు స్నాచింగ్ కేసులు, రెండు చోరీలకు వీరు బాధ్యులు. ప్రత్యేక నిఘాతో వీరిని పట్టుకోగా, నేరం అంగీకరించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.