సిద్దిపేట జిల్లాలోని ఆ ఏరియాలో.. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభిస్తాం: మంత్రి వివేక్

1 year ago 23
దుబ్బాకలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామని మంత్రి వివేక్ ప్రకటించారు. ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తోందన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్, రూ.2 లక్షల రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం త్వరలో ప్రారంభమవుతుందని.. అన్ని హామీలను అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Read Entire Article