సిద్దిపేట జిల్లా జబ్బపూర్ గ్రామంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కాషాయ జెండా ఎగురవేస్తున్న క్రమంలో విద్యుత్తు షాక్ తగిలి, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కి తరలించారు.