సిద్దిపేటలో తిరుమల శ్రీవారి ఆలయం.. టీటీడీ ఛైర్మన్‌కు హరీష్ రావు రిక్వెస్ట్

1 month ago 4
సిద్దిపేటలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరనున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. తిరుపతికి వెళ్లిన హరీష్ రావు.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని కలిసి.. ఆలయ నిర్మాణం గురించి మాట్లాడారు. సిద్దిపేటలోని కోమటిచెరువు ప్రాంతంలో సుమారు రూ.30 కోట్లతో టీటీడీ ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారని.. అందుకోసం ఇప్పటికే 5 ఎకరాల స్థలం కేటాయించామని.. దాన్ని టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి, డిజైన్లు కూడా తయారు చేసినట్టు చెప్పుకొచ్చారు. వచ్చే బోర్డు మీటింగ్‌లో ఆలయానికి ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.
Read Entire Article