తన తదుపరి సినిమాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు సినిమాలు చేస్తాననే దానిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు బాధ్యత, ఆ తర్వాతే సినిమాలన్న పవన్ కళ్యాణ్.. ముందు మనం రోడ్లను బాగుచేసుకుందామని, ఆ తర్వాతే వినోదం గురించి ఆలోచిద్దామంటూ ఫ్యాన్స్‌కు సూచించారు. తీరిక సమయాల్లో సినిమాలు చేస్తానని హామీ ఇచ్చారు.