రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఏపీలో దాదాపు 5 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. తెలంగాణలోనూ వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. తాజాగా.. సిరిసిల్ల జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. చందుర్తి మండలం లింగంపేటలో పెగ్గర్ల రమేష్ రావు కోళ్లఫామ్‌లో 2 వేల కోళ్లు చనిపోయాయి. ఇప్పటికే వెయ్యి కోళ్లు మృతి చెందడంతో బర్డ్ ఫ్లూగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.