తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం అనేక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ వృద్ధుల కాలక్షేపం కోసం అనేక సౌకర్యాలు కల్పించనున్నారు. ఇప్పటికే వీరికి ఆసరా పెన్షన్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాయితీ ఛార్జీలు, ప్రత్యేక వైద్య సేవలు కూడా వృద్ధులకు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాలతో పాటు, ప్రభుత్వం వృద్ధుల హక్కుల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.