హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరున్న 400 ఎకరాల భూముల వివాదం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా.. జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే హెచ్సీయూ విద్యార్థుల ఆందోళనలు, పర్యావరణవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖుల స్పందనతో అగ్గిరాజేయగా.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఏఐ వీడియోల ఆరోపణలతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే.. రేవంత్ రెడ్డి కామెంట్లపై బాలీవుడ్ నటి దియామీర్జా స్పందించారు.