తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. దివంగత నటుడు కృష్ణంరాజు భార్య, బాహుబలి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ప్రత్యేక బహుమతి అందించారు. ఆదివారం రోజున హైదరాబాద్‌లో నిర్వహించిన క్షత్రియ సేవా సమితి అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనగా.. ఆయనకు శ్యామలా దేవి స్వయంగా బహుమతి అందజేశారు. తాపేశ్వరం సురుచి బాహుబలి కాజాను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.