తెలంగాణ ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో కొత్త పథకం ప్రారంభించారు. గ్యాస్ వాడకాన్ని తగ్గించి, విద్యుత్ వినియోగాన్ని పెంచే ఈ-కుకింగ్ పథకానికి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ప్రతి ఇంటిపై ఇప్పటికే ఉచిత సౌర విద్యుత్ వ్యవస్థ ఉండగా.. ఇప్పుడు ఇండక్షన్ స్టవ్‌లు, కుక్కర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ పథకం విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది.