సీఎం సార్.. మా వర్గంలో నేను ఒక్కడినే ఎమ్మెల్యేను.. నాకొక ఛాన్స్ ఇవ్వండి

1 year ago 19
తెలంగాణలో గొల్ల, కుర్మలను వేరు చేసే ప్రయత్నాలు జరిగాయని, కానీ వారంతా ఒక్కటేనని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గొల్ల, కుర్మల తరపున తాను ఒక్కడినే ఎమ్మెల్యేనని గుర్తు చేశారు. ఈసారి మంత్రివర్గంలో వారికి అవకాశం ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను కోరారు. జనాభా ప్రకారం మంత్రి పదవి, ఇతర నామినేటెడ్ పదవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి వివరిస్తామని తెలిపారు.
Read Entire Article