RK Roja On Chandrababu: తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్నారు మాజీ మంత్రి రోజా. ఎవరు దర్యాప్తు జరిపినా తమకు అభ్యంతరం లేదని.. రాజకీయాల్లోకి దేవుడ్ని లాగడం దారుణమన్నారు. చంద్రబాబు అధికారం కోసం ఏదైనా చేస్తారని.. చంద్రబాబు తన స్వార్థం కోసం దేవుడితో ఆటలాడుతున్నారన్నారు. చంద్రబాబు లడ్డూ వివాదాన్ని తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి తెరపైకి తెచ్చారన్నారు. ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకుంటూ చంద్రబాబు తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.