ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయకట్టుకు గోదావరి జలాలను సరఫరా చేసే ప్రధాన ప్రాజెక్ట్ సీతారామ ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌ను సీఎం రేవంత్ నేడు ప్రారంభించారు. కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో పంపుహౌస్-2ను రేవంత్ స్విచ్చాన్ చేసి గోదావరి జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు.