సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో దక్షిణ భారతదేశానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. త్రివేండ్రం రీజియన్, విజయవాడ రీజియన్ అగ్రస్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, చెన్నై రీజియన్లు ఉన్నాయి. ఓవరాల్‌గా 93.66 శాతం సీబీఎస్ఈ పది ఫలితాల్లో ఉత్తీర్ణులు అయ్యారు. ఈ ఫలితాల్లో రీజియన్ల వారీగా వచ్చిన పాస్ పర్సంటేజీలను ఓ ఎక్స్ హ్యాండిల్‌లో పోస్టు చేయగా.. మరి హైదరాబాద్ ఎక్కడ? అంటూ కొందరు వెటకారంగా పోస్టులు చేశారు.