హైదరాబాద్‌లో పెరుగుతున్న జనభాకు అనుగుణంగా.. 50 ఏళ్ల వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సుంకిశాల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టగా.. అది ఇప్పుడు ప్రమాదానికి గురైంది. టన్నెల్ గేటు, ఇన్‌టేక్ వెల్ రక్షణ గోడ ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదానికి కారణం ఏంటనేది కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.