సూపర్ మార్కెట్‌లో చాక్లెట్‌ చోరీ.. ఉప్పు తినిపించి బాలుడికి చిత్రహింసలు

2 weeks ago 4
చాక్లెట్‌ దొంగతనం చేశాడని బాలుడిని చితకబాదిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలానికి చెందిన ఓ బాలుడు నోముల సమీపంలోని బీసీ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం మధ్యా హ్నం ఇబ్రహీంపట్నంలోని మంచాల రోడ్డులోగల మెగా డీమార్ట్‌కు వెళ్లాడు. అందులో చాక్లెట్‌ దొంగతనానికి పాల్పడ్డాడన్న నెపంతో సూపర్‌మార్కెట్‌ యజమాని, సిబ్బంది బాలుడిని గోడౌన్‌లో బంధించి చితకబాదారు. నోట్లో ఉప్పు వేసి తినిపించారు. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వార్డెన్‌తోపాటు అధ్యాపకులు సూపర్‌ మార్కెట్‌ యాజమాన్యంపై ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Entire Article