Ys Sharmila On Chandrababu Super Six Schemes: గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది.. సంక్షేమ పథకాలను అమలు చేయలేం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల అదే జరిగింది అన్నారు. అయితే పథకాలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలుకు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు.. సూపర్ ఫ్లాప్ అయ్యాయి అన్నారు. సాకులు వెతకడం మానేసి పథకాల అమలుపై ఫోకస్ చేయాలని సలహా ఇచ్చారు.