సూర్యాపేట జిల్లాలో మిరప కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడటంతో మాదరబోయిన యాదమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. కుక్క అడ్డు రావడంతో ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. యాదమ్మ మరణంతో ఆమె కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా మారింది. ఆమె భర్త, పిల్లల ఆర్తనాదాలు ఆ ప్రాంతాన్నంతా కలచివేస్తున్నాయి. ఆటోలో ఉన్న మిగతా పది మంది తీవ్రంగా గాయపడటంతో వారిని వెంటనే సూర్యాపేట జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.