సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువతి స్నేహితురాలిని ఇంటికి పిలిపించి స్నేహితుడితో అత్యాచారం చేయించింది. మద్యం తాగించి అత్యాచారం చేయించటమే కాకుండా దగ్గరుండి వీడియోలు రికార్డు చేసింది. అనంతరం తాము చెప్పినట్లు వినాలని మరోసారి బెదిరింపులకు పాల్పడటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.