భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య ఓ డిగ్రీ విద్యార్థిని సోషల్ మీడియాలో చేసిన పోస్టు.. ఆమెను ఇబ్బందుల్లో పడేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని పాకిస్థాన్‌కు మద్దతుగా, భారతదేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టు చేసింది. ఈ పోస్టు వైరల్ కాగా.. వ్యవహారం బీజేవైఎం కార్యకర్తల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ విద్యార్థినిని సస్పెండ్ చేయాలంటూ కాలేజీ యాజమాన్యాన్ని బీజేవైఎం కార్యకర్తలు కోరారు. అలాగే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు డిగ్రీ విద్యార్థినిని కాలేజీ సస్పెండ్ చేసినట్లు సమాచారం.