హైదరాబాద్ పరిధిలో మరో కొత్త సిటీ నిర్మించబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు తోడుగా.. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో నాలుగో సిటీ నిర్మిస్తామన్నారు. 4 వేల ఎకరాల్లో నిర్మించబోయే ఈ నగరంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.