సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీలకు తెలంగాణ హైకోర్టు జైలు శిక్ష విధించింది. భూ వివాదంలో పిటిషనర్‌కు రక్షణ కల్పించాలన్న గత ఉత్తర్వులను అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కింద ఇద్దరికీ రెండు వారాల జైలు శిక్షతోపాటు రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో వారం జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. అప్పీల్‌కు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును వారం రోజులు నిలిపివేసింది.