ఉపాధి కోసం సౌదీ వెళ్లిన ఓ తెలంగాణ వాసి అక్కడికెళ్లిన మూడు రోజులకే ప్రాణాలు కోల్పోయాడు. హార్ట్ ఎటాక్ రావటంతో కూర్చున్న చోటే కుప్పకూలి చనిపోయాడు. ఇది తెలియని యజమాని, విధులకు రాకుండా పారిపోయాడంటూ దుబాయ్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. అయితే నెల రోజుల తర్వాత అతడు చనిపోయిన విషయం కామారెడ్డిలోని అతడి కుటుంబసభ్యులకు తెలిసింది.