ఏపీ రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం ఓ ఫోటో వైరల్ అవుతోంది. వైసీపీ హయాంలో సీఎం వైఎస్ జగన్ ప్రచార యావతో విద్యార్థులకు అందించిన కిట్లు, బ్యాగులపై తన ఫోటో, పేరును ముద్రించుకున్నారని టీడీపీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు విద్యార్థులకు పంపిణీ చేసిన సైకిళ్లపై చంద్రబాబు ఫోటోను ముద్రించారంటూ ఓ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. దీని వెనుక నిజానిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.