తెలంగాణలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు 2026-27 విద్యా సంవత్సరంలో వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను తరగతుల వారీగా పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. గవర్నింగ్ బాడీ సభ్యుల సంతకాలతో ఫీజు నిర్ణయానికి సంబంధించిన పత్రాలను కూడా అప్‌లోడ్ చేయాలి. వివరాలు సమర్పించని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆర్‌జేడీలు, డీఈఓలను ఆదేశించారు. అయితే పలు ఆదేశాలకు తుది గడువు లేకపోవడం అమలుపై ప్రభావం చూపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.